11 Rules For Life: Secrets to Level Up (Telugu)(Paperback, Chetan Bhagat (Author) Dr. C Paradhasaradhi (Translator))
      
      
 
 
 
    
 
        
     
Quick Overview
 
     
   
Product Price Comparison
 
 
  భారతీయులంతా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకంఫుడ్ డెలివరీ పనిచేసే విరాజ్ ఓ రోజు మధ్యాహ్నం భోజనం తీసుకుని రచయిత చేతన్ ఇంటికి వచ్చాడు. అతను ఆలస్యంగా రావటమే కాదు, బాగా ఒత్తిడితో సతమతమవుతూ కనిపించాడు. చేతన్ వివరాలు అడిగినప్పుడు భళ్లుమన్నాడు. “నా కెరీర్ ముందుకు సాగటం లేదు. నా స్నేహితురాలు వదిలేసిపోయింది. నాకు భవిష్యత్తు కనిపించటం లేదు. జీవితం అంటేనే ద్వేషం కలుగుతోంది" అని విరాజ్ కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు రచయిత అతనికి ఓ ప్రతిపాదన చేశాడు. "ప్రతిరోజూ మధ్యాహ్నం నేను ఆర్డర్ చేసిన భోజనం తీసుకుని వస్తే, నేను నేర్చుకున్న జీవిత రహస్యాలను రోజుకొకటి వంతున చెబుతా” అన్నాడు.ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేయగల 'పండంటి జీవితానికి 11 సూత్రాలు’ అన్న ఈ పుస్తకానికి స్వాగతం. వ్యక్తిగత విషయాలుగా కనిపించినా, చేతన్ ఇందులో తన విజయాలను, వైఫల్యాలను, వివిధ రంగాల్లో విజేతలతో మాట్లాడిన, రెండు దశాబ్దాలుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసిన అనుభవాలను ఇందులోపొందుపరిచారు.భారత దేశంలో ఎక్కువ మంది పాఠకులు చదివే రచయిత చేతన్ శైలి సూటిగా, సరళంగా, స్ఫూర్తివంతంగా సాగుతుంది. అసమానతలు, పోటీ విపరీతంగా ఉన్న ఈ ప్రపంచంలో విజయం సాధనకు మీ మెదడును సన్నద్ధం చేస్తుంది.అత్యుత్తమ జీవితాన్ని గడిపేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?మీ జీవితాన్ని మార్చగలిగిన పుస్తకం ఏదయినాఉంది అంటే.. అది ఇదే..